నా వల్లే అతను చనిపోయాడు… బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

BJP politician సాధ్వీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్…. ముంబైకి 250 కి.మీ. దూరంలో ఉన్న మాలేగావ్‌లో 2008 సెప్టెంబర్ 29న ముంబై పేలుళ్లో ప్రధాన నిందితురాలుగా అరెస్ట్ అయ్యారు. పేలుళ్లకు సాధ్వీకి చెందిన మోటర్ సైకిల్ ఉపయోగించడంతో ఆమెను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేసారు. తాజాగా బెయిల్ పై విడుదలైన ప్రజ్ఞా సాధ్వీ ముంబై ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన పోలీస్ అధికారి హేమంత్ కర్కరే‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.

Bjp politician
BJP politician Sadhvi Pragya Singh

కర్కరే తనను టార్చర్ చేశాడని.. తీవ్ర మానసిక క్షోభతో తను శపించడంతో రెండు నెలల్లోపే ఆయన హతం అయ్యాడన్నారు. 2008 నవంబర్ 26 జరిగిన ముంబై ఉగ్రదాడుల్లో 166 మంది ప్రాణలు కోల్పోయారు. ఉగ్రవాదులతో పోరాడుతూ యాంటీ టెర్రర్ స్క్వాడ్‌ చీఫ్ కర్కరే కూడా చనిపోయారు.

దేశం కోసం పోరాడుతూ ప్రాణ త్యాగం చేసిన కర్కరేపై సాధ్వీ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ పార్టీ మండిపడింది. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, ఆమెపై చర్యలు తీసుకోవాలని బీజేపీని డిమాండ్ చేసింది. వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగిన బీజేపీ ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, వ్యక్తిగతమైనవి ప్రకటించింది. ఏళ్ల తరబడి అనుభవించిన మానసిక, శారీరక వేదన కారణంగానే ఆమె ఈ వ్యాఖ్యలు చేసుంటారని బీజేపీ అభిప్రాయపడింది. 

ఇంటా బయటా ఒత్తిడి పెరగడంతో సాధ్వీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. బాధతోనే తాను అలా మాట్లాడానని, కర్కరే దేశం కోసం పోరాడుతూ వీర మరణం పొందాడన్నారు. 

Bjp politician ప్రజ్ఞా సింగ్‌‌ను మాలేగావ్‌ బాంబు పేలుడు కేసులో మహారాష్ట్ర యాంటీ టెర్రర్ స్క్వాడ్‌ (ఏటీయస్) 2008లో అరెస్టు చేసింది. ముంబై ఉగ్రదాడుల్లో వీర మరణం పొందడానికి రెండు నెలల ముందు ఏటీయస్ చీఫ్ కర్కరే సాధ్వీని విచారించారు.

ముంబైకి 250 కి.మీ. దూరంలో ఉన్న మాలేగావ్‌లో 2008, సెప్టెంబర్ 29న పేలుళ్లు సంభవించాయి. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా.. 101 మంది గాయపడ్డారు. సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌తోపాటు లెఫ్ట్‌నెంట్ కల్నల్ శ్రీకాంత్ పురోహిత్ తదితరులు ఈ కేసులో అరెస్టయ్యారు. ఈ కేసులో సాధ్వీ ప్రజ్ఞా సింగ్‌‌ను మొదటి నిందితురాలిగా చేర్చారు.

Subscribe to our youtube channel at Chudubabai Youtube
Read our stories at Chudubabai Stories

Facebook Comments
Follow me

Sarath Chandra

I'm passionate about writing, also working as a journalist. I had an Idea to share my writings, so started this blog along with cousins
Follow me