Jagan Creates New History in AP Politics

Jagan Creates New History రాజకీయాల్లో వారసత్వం అనేది కొత్తేమీకాదు. తమ కుటుంబసభ్యుల బాటలో అనేక మంది నాయకులు రాజకీయాల్లోకి వచ్చారు. వారిలో కొంతమంది సక్సెస్ కాగా… మరికొంతమంది విఫలయ్యారు. అలా తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక మంది నాయకులు వారసత్వంగానే రాజకీయాల్లోకి వచ్చి రాణిస్తున్నారు. అయితే ఇలాంటి వారిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో తండ్రి తరువాత రాష్ట్రానికి సీఎం అయిన మొదటి వ్యక్తిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రికార్డ్ సృష్టించబోతున్నారు.

నవ్యాంధ్రలో నవశకం ఆరంభమైంది. పదేళ్లుగా ఎదురుచూస్తున్న జగన్ కల నెరవేరింది. అసెంబ్లీ ఎన్నికల్లో విజేతగా నిలిచి.. సీఎంగా పట్టాభిషేకం పొందారు జగన్మోహన్ రెడ్డి. పాదయాత్రతో మొదలైన జగన్ ప్రస్థానం.. సీఎం పీఠం వరకు తీసుకొచ్చింది. నవ్యాంధ్రకు నయాం సీఎం రాకతో.. కొత్త కళ సంతరించుకుంది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే దృశ్యాన్ని చూసేందుకు అన్ని జిల్లాల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విజయవాడలోని ఇందిరా మైదానంలో మే 30న మధ్యాహ్నం 12.23 గంటలకు నవ్యాంధ్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు జగన్. ఇక ప్రమాణస్వీకారానికి ముందు తన సెంటిమెంట్ ను ఫాలో అయ్యారు. దైవదర్శనంతో పాటు ఇడుపులపాయలో తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించి అంజలి ఘటించారు.

jagan creates new history

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి కడప జిల్లా కంచుకోట. ముఖ్యంగా పులివెందులలో 1978 నుంచి ఆ కుటుంబ ఆధిపత్యమే నడుస్తోంది. అలాంటి జిల్లా నుంచి తొలిసారిగా 2004లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఎన్నికయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో అత్యున్నత పీఠాన్ని అధిరోహించి శెభాష్‌ అనిపించుకున్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు చేరువయ్యారు. అలా 2009 ఎన్నికల్లోనూ వైఎస్‌ విజయం సాధించగా.. 2009 సెప్టెంబరు 2న అకాల మృత్యుఒడికి చేరారు.

అనూహ్య పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీతో విభేదించి వైఎస్‌ జగన్‌ బయటకు వచ్చారు. 2014 ఎన్నికల్లో పోటీచేసినా టీడీపీ రాష్ట్రంలో విజయం సాధించడంతో.. జగన్‌ పార్టీ ప్రతిపక్షానికే పరిమితమైంది. తర్వాత ప్రస్తుత ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధికంగా 151 స్థానాలను వైకాపా చేజిక్కించుకోగా.. ఇటీవలే శాసనసభాపక్ష నేతగా వైఎస్‌జగన్‌ను ఆ పార్టీ నాయకత్వం ఎన్నుకుని ముఖ్యమంత్రిగా ప్రతిపాదించారు. ఆ మేరకు జగన్ ప్రమాణస్వీకారం చేశారు. ఒకే కుటుంబంలో రెండో సీఎం ఎన్నిక జరుగుతుండగా.. చిన్న వయసులోనే కీలక కుర్చీని అందుకునే అవకాశం వైఎస్‌ జగన్‌కే దక్కింది. మొత్తానికి తండ్రి తరహాలోనే సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి…ఆయనలాగే సీఎం పీఠం అధిరోహించారు.

Also Read our latest articile about Jagan Here : Janam Mechina Jagan

Jagan creates new history in AP Politics written by SarathChandra.Ayyagari

Facebook Comments
Follow me

Sarath Chandra

I'm passionate about writing, also working as a journalist. I had an Idea to share my writings, so started this blog along with cousins
Follow me