Rajini Gave Clarity on his political Life

తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి రాబోతున్నానని గతంలోనే ప్రకటించారు. ఇక ఆయన కొత్త పార్టీ ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఇక ఇన్నాళ్ల మౌనానికి ఆయన తెరదించారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని రజనీకాంత్ స్పష్టం చేసారు.

పార్టీ ప్రకటించినప్పటికి నుంచి రజనీ తెర వెనుక సన్నాహాలు చేస్తూనే ఉన్నారు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేయడంలేదు. కానీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాను సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలు ఎదుర్కొనేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

తమిళనాడులో 18 అసెంబ్లీ స్ధానాలకు జరిగిన ఉప ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి. ఈ ఉపఎన్నికల్లో అన్నాడీఎంకే మెజార్టీ స్ధానాలు గెలవకపోతే… ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది. ఉపఎన్నికల ఫలితాలు అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా వచ్చి ప్రభుత్వం కూలిపోయి మధ్యంతర ఎన్నికలు వస్తే తప్పకుండా పోటీ చేస్తామన్నారు.

రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు చాలా కాలం కిందటే ప్రకటించిన రజనీ.. ఇప్పటివరకు పార్టీ పేరు, విధివిధానాలపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన చేసిన ప్రకటన అభిమానుల్లో ఉత్సాహం నింపింది. 

Facebook Comments
Follow me

Sarath Chandra

I'm passionate about writing, also working as a journalist. I had an Idea to share my writings, so started this blog along with cousins
Follow me

Leave a Comment