The Journey of Ram Master

జర్నీ బిగిన్స్ (ఇంజనీరింగ్)

VIT మైఖేల్ జాక్సన్… Vishnu Institute of Technology లో చదివిన వారికి ఈ ఇంట్రడక్షన్ చాలు , కానీ ఇది చదివే వాళ్ళు మా కాలేజీ కాదు కాబట్టి అసలు పేరు తో మొదలు పెడుతున్న ఇప్పుడు రామ్ ఇసుకపాటి.

కొందరిలాగ కాకుండా అందరిలాగానే ఇంచుమించు 15 బాక్లాగ్స్ తొ ఇంజనీరింగ్ పూర్తి చేసి, వచ్చిన సర్టిఫికెట్ ని మడత పెట్టి మంచం కింద పెట్టి, ఎప్పటినుండో ప్యాషన్ ఐన డాన్స్ కోసం అడుగులు వేసాడు. అప్పట్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి జాబ్ తెచ్చుకోవడం మా గోల్ అయితే తనకి మాత్రం ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడమే తన డ్రీం ప్రాజెక్ట్.

మేమందరం ఇంజనీరింగ్ అయ్యాక మా జీవితాలని వెతుకుందామని అనుకుంటుంటే, తన లైఫ్ ని కాలేజ్ లో ఉన్నప్పుడే మలచుకుంటూ వచాడు. అప్పటి వరకూ డాన్స్ అంటే తనకి ఇంట్రెస్ట్ అని మా CSE (A ) సెక్షన్ కి మాత్రమే తెలుసు కానీ 2013 ఫ్రెషర్స్ డే రోజు న తన పెర్ఫార్మన్స్ చూసాక అది ఇంట్రెస్ట్ కాదు ప్యాషన్ అని కాలేజీ మొత్తానికి తెలిసింది. అలాగే ఫెస్ట్ రోజు చేసిన మైఖెల్ జాక్సన్ సాంగ్ కి చాలా మంచి పేరు వచ్చింది

RAM Dance Performance on Vishnu Valiant

అప్పటి నుండీ డాన్స్ తో పాటు చదువు కి కుడా ఇంపార్టెన్స్ ఇవ్వడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులలోనే అన్ని బ్రాంచెస్ తిరుగుతూ ఒక టీం ని ఫార్మ్ చేస్కుంటూ వచ్చి ఫ్లాష్మోబ్స్ (FLASHMOBS ) కుడా చేయించాడు. అసలు తను లేని ఈవెంట్ జరిగేది కాదు కాలేజ్ లో.

Ram’s Flash Mob in VIT Bhimavaram
Ram’s Flash mob at Geetha Multiplex Bhimavaram

డాన్స్ అండ్ స్టడీస్ కి ప్రాధాన్యత ఇస్తూనే మొత్తానికి ఇంజనీరింగ్ అవ్వగొట్టాడు. అన్ని బాక్లాగ్స్ ఒక్కసారి క్లియర్ చేయడం మాములు విషయం కాదు.

ఇంజనీరింగ్ తరువాత

మేమందరం ఇంజనీరింగ్ అయిపోయాక బెంగుళూరు, హైదరాబాదు, చెన్నై అంటూ వెళ్లిపోతుంటే తను మాత్రం మళ్ళీ కాలెజ్ కి వచ్చాడు సర్టిఫికెట్ కోసం కాదు తనని సర్టిఫై చేసుకోడానికి. విష్ణు కాలేజ్ వైస్ ఛైర్మన్ Sri. రవిచంద్రన్ గారు పర్మిసన్ ఇవ్వడం తో శ్రీ లక్ష్మి మాడం సపోర్ట్ తో కాలేజీ లోనే ఆడిషన్స్ కండక్ట్ చేసి ఒక టీం ని తయారు చేస్కుని భీమవరం కుర్రాడు (BHIMAVARAM KURRADU) అనే ఆల్బం డైరెక్ట్ చేసాడు. ఆ ఆడియో లాంచ్ విష్ణు F.M ద్వారా జనవరి 12 2017 న జరిగింది. విష్ణు F.M లో జరిగిన మొట్ట మొదటి ఆడియో లాంచ్ ఇదే. ఈ ఆల్బం రిలీజ్ అయిన కొన్ని రోజులకే ఒక లవ్ ఆల్బం తో అందరిని అలరిస్తూ, అలాగే కొనసాగుతూ వచ్చాడు.

Bhimavaram Kurradu Music Video

చాలా సార్లు వింటుంటాం మనం ఎవరైనా అంటుంటే “ఎవడితో అయితే తిట్టించుకున్నాడో వాడితో పొగిడించుకోడం కుడా సక్సెస్ ఏ” అలాగే అప్పుడప్పుడు లెక్చరర్స్ తో చిన్న చిన్న మాటలు పడే తను. విష్ణు కాలేజ్ కల్చరల్ డాన్స్ ప్రోగ్రాం కి జడ్జి గా అటెండ్ అయ్యి, అదే లెక్చరర్స్ మధ్యలో కూర్చుని. ఏ కాలేజ్ లో అయితే Supply FEE కట్టాడో అదే కాలేజ్ లో రెమ్యూనరేషన్ అందుకున్నాడు.

Ram Receiving Remuneration as a Judge for Vishnu Culturals.
Ram As Judge for Vishnu Cultural
Ram on Location

కెరీర్

ఇంజనీరింగ్ చేస్తున్నంత సేపు మహర్షి లో మహేష్ బాబు లాగ చాలా అనుకుంటాం కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరగవు, CEO అవుదాం అనుకున్నవాడు B.P.O అవ్వొచ్చు. Software Engineer అవుదాం అనుకున్న నాలాంటి వాడు Digital Marketer అవొచ్చు కానీ తను ఏది అనుకున్నాడో అదే అవుదాం అని ఫిక్స్ అయ్యాడు, స్టడీస్ పట్ల అంత ఇంట్రెస్ట్ లేకపోయినా పేరెంట్స్ కోసం ఇంజనీరింగ్ పూర్తి చేసి FILM INDUSTRY లోకి అడుగు పెట్టాడు.

Ram with D Crew

ఈటీవీ వారి D ప్రోగ్రాం ఒక చిన్న గ్రూప్ డాన్సర్ గా కెరీర్ స్టార్ట్ చేసి, తన పెర్ఫార్మన్స్ తో అలరించి సాయి తేజ మాస్టర్ కి అసిస్టెంట్ గా జాయిన్ అయ్యాడు. భీమవరం కుర్రాడు ఆల్బం పూర్తి చేసిన కొన్ని రోజుల లోనే తన మాస్టర్ నే కోరియోగ్రఫీ చేసి సాయి తేజ మాస్టర్ తో నెవెర్ గివె అప్ ( NEVER GIVE UP) అనే ఆల్బం చేసాడు.

రీసెంట్ గా “తెలంగాణ టీవీ” అనే యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి, అలాగే నిన్ననే (జూన్ 15 2019) న “1st ర్యాంక్ రాజు” సినిమా ఆడియో లాంచ్ చేసాడు. అంతే కాకుండా తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఒక కొరియోగ్రాఫర్ కి అతి ముఖ్యమైన “తెలుగు మూవీ డాన్స్ డైరెక్టర్ కార్డ్” ( TELUGU MOVIE DANCE DIRECTOR CARD ) ని సంపాదించి రామ్ మాస్టర్ (RAM MASTER) గా మారి తన గమ్యానికి చేరువవుతున్నాడు.

The Journey of Ram Master
RAM at 1st Rank Raju Audio Launch

మనలో చాలామంది వినే ఉంటాం భీమవరం నుండి ఆక్టర్స్, డైరెక్టర్స్ , ప్రొడ్యూసర్స్ ఫిలిం ఇండస్ట్రీ కి వచ్చారని, త్వరలో రామ్ ఇసుకపాటి అలియాస్ రామ్ మాస్టర్ పేరు ని కుడా సిల్వర్ స్క్రీన్ మీద చూడబోతున్నాం మనం.

View this post on Instagram

#Cinema #Dance #Chreographer #Dancer

A post shared by Ram Isukapati (@ram_choreographer) on

RAM’s TFTDDA Card

వెయిట్ అండ్ వాచ్… అల్ ది బెస్ట్ రామ్ మాస్టర్ (ఇప్పుడు అర్ధం అయిందనుకుంట VIT మైఖేల్ జాక్సన్ అని ఎందుకు అంటారో) This is the Journey of RAM Master

KGF Feet. RAM

Get Ram’s Videos and Updates to your messenger directly
click on the below button to start now and check your messengerBecome his friend on Facebook: https://www.facebook.com/ram.isukapati
Follow him on Instagram: https://www.instagram.com/ram_choreographer/
Twitter: https://twitter.com/Ram_Isukapati
Subscribe to his Youtube Channel for more videos: Ram’s Youtube Channel

People who read this also read: A Review on Jagan’s Government

Facebook Comments
Follow me

Manoj Ayyagari

I'm a Digital Marketer as well as a freelance marketing consultant from Bangalore, having an experience among various niches from online course building to brand promotion. One day I'll start my own company
Manoj Ayyagari
Follow me

Latest posts by Manoj Ayyagari (see all)