The Reporter – Episode #1

“The Reporter Episode-1.” నా చదువు అయితే పూర్తి అయ్యింది కానీ జీవితాన్ని తెలుసుకునే చదువు మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది అని అర్ధం అయ్యింది. ఇంజనీరింగ్ పూర్తి చేసి సరైనా ఉద్యోగం లేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. చిన్నప్పటి నుంచి ఒకటే మాట 10th కంప్లీట్ అయితే చాలు అనేవారు అలా టెన్త్ కష్టపడి చదివితే ఇంటర్ అన్నారు, ఇంటర్ పూర్తి అయితే చాలు లైఫ్ లో సెటిల్ అయినట్లే అన్నారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ చదివితే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు అన్నారు. అలానే కష్టపడి ఇంజనీరింగ్ లో బాడ్ నేమ్ కానీ బ్యాక్ లాగ్ కానీ లేకుండా డిగ్రీ తీసుకున్నా. అయితే ఎవడికి లాభం ఉద్యోగం మాత్రం లేదు. ఇంజనీరింగ్ పూర్తి అయ్యి 6 నెలలు దాటుతోంది. ఇక నిర్ణయించుకున్నా జీవితాన్ని మొదలుపెట్టాలని. ఉద్యోగాల వేట మొదలయ్యింది. దేవుడికి నా మీద ఎలాంటి జాలి లేదేమో ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన నన్ను రిజెక్ట్ చేయిస్తున్నాడు. ఇక కనిపించిన ,తెలిసిన అన్ని కంపెనీ లకి resume పంపించా. ఇన్నాళ్ళకి శని అడ్డు తప్పుకున్నడేమో ఒక పెద్ద కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఈ విషయం ఇంట్లో చెప్పి రాత్రి బస్ కి హైదరాబాద్ బయలుదేరా.

నా చదువు అయితే పూర్తి అయ్యింది కానీ జీవితాన్ని తెలుసుకునే చదువు మొదలు పెట్టాల్సిన సమయం వచ్చింది అని అర్ధం అయ్యింది. ఇంజనీరింగ్ పూర్తి చేసి సరైనా ఉద్యోగం లేక ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. చిన్నప్పటి నుంచి ఒకటే మాట 10th కంప్లీట్ అయితే చాలు అనేవారు అలా టెన్త్ కష్టపడి చదివితే ఇంటర్ అన్నారు, ఇంటర్ పూర్తి అయితే చాలు లైఫ్ లో సెటిల్ అయినట్లే అన్నారు. ఆ తర్వాత ఇంజనీరింగ్ చదివితే జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు అన్నారు. అలానే కష్టపడి ఇంజనీరింగ్ లో బాడ్ నేమ్ కానీ బ్యాక్ లాగ్ కానీ లేకుండా డిగ్రీ తీసుకున్నా. అయితే ఎవడికి లాభం ఉద్యోగం మాత్రం లేదు. ఇంజనీరింగ్ పూర్తి అయ్యి 6 నెలలు దాటుతోంది. ఇక నిర్ణయించుకున్నా జీవితాన్ని మొదలుపెట్టాలని. ఉద్యోగాల వేట మొదలయ్యింది. దేవుడికి నా మీద ఎలాంటి జాలి లేదేమో ఇంటర్వ్యూ దాకా వెళ్ళిన నన్ను రిజెక్ట్ చేయిస్తున్నాడు. ఇక కనిపించిన ,తెలిసిన అన్ని కంపెనీ లకి resume పంపించా. ఇన్నాళ్ళకి శని అడ్డు తప్పుకున్నడేమో ఒక పెద్ద కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది. ఈ విషయం ఇంట్లో చెప్పి రాత్రి బస్ కి హైదరాబాద్ బయలుదేరా.

నా ఫ్రెండ్ కిరణ్ హైదరాబాద్ లోనే ఉండడంతో వాడి రూమ్ కి వెళ్ళా. వాడి రూమ్ లో ఫ్రెష్ అయ్యి ఆ రోజు అంతా రూమ్ లో ప్రిపేర్ అయ్యి, శనివారం కిరణ్ కి సెలవు అవ్వడంతో ఆ రోజు వాడిని తీసుకుని ఇంటర్వ్యూ కి వెళ్ళా.. అన్ని రౌండ్స్ బాగానే జరిగాయి, కానీ HR అడిగిన ఒకే ఒక్క ప్రశ్న కి నా దగ్గర సమాధానం లేదు. అదే “ ఇన్ని రోజులు ఖాళీగా ఎందుకు ఉన్నావు??” ఏం చెప్పాలో తెలికా “ sir I’m waiting for a good opportunity, by the god’s grace, now I got a interview call from you “ అన్నా “Ok we will let u know the result in few days” అనగానే Thank You సర్ అని బయటకి వచ్చా, కిరణ్ గాడు కంగ్రాట్స్ రా అనగానే జాబ్ గ్యారంటి అనుకుని థాంక్స్ రా అన్నా.. కానీ రిజల్ట్ ఇంకా చెప్పలేదురా మెయిల్ చేస్తాం అన్నారు అని అక్కడి నుంచి బయలుదేరాం… కిరణ్ గాడు హాస్టల్ కి కాకుండా వేరే ఎక్కడికో తీసుకెళ్తున్నాడు, ఎక్కడికి రా అంటే హాస్టల్ ఫుడ్ బాగోదురా నాకు ఎలాగా తప్పట్లేదు, నువ్వు కూడా అక్కడే తినాలా అని రెస్టారెంట్ కి తీసుకెళ్ళాడు. అక్కడ వాడి ఫ్రెండ్ అంటూ ఒక అమ్మాయిని పరిచయం చేసాడు. ఆ అమ్మాయి ఒక మినిస్టర్ దగ్గర పర్సనల్ సెక్రటరీ గా చేస్తోంది. ముగ్గురం భోజనం చేసి మేము ఇద్దరం హాస్టల్ కి వచ్చేసాం. ఇంటర్వ్యూ అయ్యింది కదా ఇక నేను వెళ్తారా అంటే ఎందుకురా రిజల్ట్ తెల్సుకుని వెళ్ళు అన్నాడు. ఎందుకురా జాబ్ వస్తే ఎలాగా ఇక్కడే కదా ఉండాలి అని రేపు ఉదయం ట్రైన్ కి టికెట్ బుక్ చేసుకున్నా. ఆదివారం ఉదయం 9:00 కి ట్రైన్ కాబట్టి మేము ఉదయం 8:00 కి స్టేషన్ కి బయలుదేరాం.. మేము వెళ్ళిన 5 నిమిషాల్లో ట్రైన్ వచ్చింది. భోగి దగ్గర చార్ట్ లో నా పేరు చూసుకున్నా, నా పేరు కింద ఉన్న ఇంకో పేరు నన్ను బాగా ఆకర్షించింది.

ఎవరో చూద్దాం లే అని ట్రైన్ ఎక్కి నా ప్లేస్ లో బాగ్ పెట్టి ఇంకా టైం ఉంది కదా అని కిందకి దిగి కిరణ్ తో మాట్లాడుతుండగా ట్రైన్ గ్రీన్ సిగ్నల్ పడింది, సిగ్నల్ పడింది ట్రైన్ ఎక్కరా అని కిరణ్ అనేలోపే ట్రైన్ కదిలింది. రన్నింగ్ లో ట్రైన్ ఎక్కి నా ప్లేసులో చూస్తే ఆ అమ్మాయి ప్లేసులో ఒక పెద్దాయన కుర్చుని ఉన్నాడు. నాది సైడ్ అప్పర్ కానీ నా పక్కన ఒక పెద్దాయన ఉన్నాడేంటి అని చార్ట్ లో చూస్తే ప్రహసిత 22 F అని ఉంది కానీ ఈ స్టేషన్ కాదు. సరే అని వెళ్లి నా ప్లేస్ లో పడుకున్నా. ఈ లోపు ఎవరో వచ్చి Hello Excuse me అనా డంతో కళ్ళు తెరిచా కానీ ఆ మాటలు నాతో కాదు నా పక్కన ఉన్న పెద్దాయన తో. ఆ అమ్మాయి అలా అనడంతో అయన లేచి వెళ్ళిపోయాడు. నిద్రమత్తు లో అమ్మాయిని చూసిన నేను అమ్మాయికి తగ్గ పేరు అనుకుని పేస్ వాష్ చేసుకోడానికి వెళ్ళా… ఈ ప్రయాణం నా జీవిత ప్రయాణం గా మలుపు తిరుగుతుందని ఊహించలేదు. ఫేస్ వాష్ చేసుకుని వచ్చి నా ప్లేస్ లో కుర్చుండిపోయా. ఏమి తోచక ఫేస్బుక్ న్యూస్ ఫీడ్ స్క్రోల్ చేస్తున్నా, అది కూడా బోర్ కొట్టి యూట్యూబ్ లో న్యూస్ చూస్తూ ఆ అమ్మాయి ఏం చేస్తోందా? అని తన వైపు చూసా కానీ తన పనిలో తను ఉంది బుక్ చదువుకుంటూ కిటికీ లోంచి బయటకు చూస్తోంది. ఒక్క సెకండ్ మర్యాద రామన్న సినిమా గుర్తుకొచ్చింది. ఎదురుగా అందమైన అమ్మాయి కానీ మాట్లేడే దైర్యం లేదు, పొద్దున్న నుంచి ఒకటే న్యూస్ బోర్ అని ఫోన్ ఛార్జింగ్ పెట్టి నేను కూడా బయటకు చూస్తున్నా.

Excuse Me” అని మళ్ళీ వినిపించింది, నన్ను కాదు ఏమో అనుకున్నా కానీ ఈసారి మాత్రం నన్నే. “ ఈ ప్రయాణం హడావిడి లో పడి నా ఛార్జర్ మర్చిపోయా, ఒకసారి మీ చార్జర్ ఇస్తారా?” అని అడిగింది. సరే అని నా ఫోన్ ఛార్జింగ్ నుంచి తీసి ఆ అమ్మాయికి చార్జర్ ఇచ్చా. తను ఫోన్ ఛార్జ్ పెట్టేసి పెన్ తో బుక్ ని కొడుతోంది. మాట కలుపుదాం అంటే భయం. “Love At First Sight” ఈ మాట చాల సార్లు చాల మంది దగ్గర విన్నా కాని మొదటి సారి ఆ అనుభూతిని ఫీల్ అవుతున్నా. కానీ మాట్లాడలేను భయం, ఇంతలో మళ్ళీ Excuse Me అని పిలుపు, ఈమెకి Excuse Me తప్ప ఇంకే మాటలు రావా అనుకుని చెప్పండి అన్నా. “ ఏం లేదండి, జర్నీ చాలా బోర్ గా ఉంది, పైగా ఎండలు బాగా ఉన్నాయి కదా” అంది. “అవునండి, న్యూస్ చూద్దామన్న సొల్లు తప్ప ఇంకేమి రావటంలేదు” అన్నా. “మీకు న్యూస్ అంటే అంత ఇంట్రెస్ట్ ఆ??” అంది. “అలా అనేం కాదు కానీ మన చుట్టూ జరిగేవి తెలుసుకోవాలనే చిన్న ఆత్రుత” అని అన్నాను. “ ఓహ్ ఎక్కడి దాక వెళ్తున్నారు?” “ నేను గోదావరి జిల్లాలోని విశ్వనాధపురం, మరి మీరు??” అని తనని అడిగా. బహుశా తనని అలా
అడగకపోయి ఉంటే నా జీవితం ఇలా మలుపు తిరిగి ఉండేది కాదేమో…….

Facebook Comments
Follow me

Sarath Chandra

I'm passionate about writing, also working as a journalist. I had an Idea to share my writings, so started this blog along with cousins
Follow me