UP CM Yogi Sets New Trend in Political Campaign

ఆయన స్టార్ క్యాంపైనర్ కాదు… కానీ ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. ఆయనేమి రాజకీయ వ్యూహకర్త కాదు… ఓ మఠాధిపతి… రాజకీయ నాయకుల్లా పైకి ఓ మాట లోపల ఓ మాట మాట్లాడడం ఆయనకి రాదు. హార్డ్ కోర్ హిందుత్వ వాది… ఆయనే యూపీ సీఎం యోగీ ఆధిత్యనాధ్…

యోగి ఆదిత్యనాధ్…. కాషాయ రంగు ధరించి రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించారు. ఇక 2014లో యూపీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఈ కాషాయధారి సీఎం అయ్యారు. ఇక అప్పటి నుంచి అక్కడ హిందువులకు జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తారు. ఎన్నికల ప్రచారాల్లో కూడా దూసుకుపోతూ విపక్షాలపై ఆరోపణల వర్షం కురిపిస్తున్నారు.

చిన్నప్పటి నుంచి హిందుత్వ భావజాలం కలిగిన యోగి బీజేపీ తరపున ఐదు సార్లు ఎంపీగా గెలిచారు. గోరఖ్ నాధ్ మఠాధిపతి అయిన యోగీ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. పార్లమెంటు సభ్యునిగా కన్నా హిందూ అతివాదిగానే ఆయన ఎక్కువగా పాపులర్‌ అయ్యారు. ఇతర మతాల వారిని హిందువులుగా మార్చాలన్నదే తన జీవిత లక్ష్యమని ఆయన చెప్తారు.

ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాధ్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. విపక్షాలపై తనదైన స్టైల్లో విమర్శలు చేస్తూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు యోగి ఆదిత్యనాథ్‌పై ఎన్నికల సంఘం కొరఢా ఝుళిపించింది. ఆయనపై మూడు రోజుల పాటు నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాథ్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.          

ప్రచారం చేయొద్దని ఎన్నికల సంఘం ఆదేశించడంతో యోగీ గోరఖ్‌నాథ్ దేవాలయంలో భక్తులకు హనుమాన్ చాలీసా చదివి వినిపించారు. ఆధ్యాత్మిక భావనలు మెండుగా ఉండే యోగి చాలీసాను అత్యంత భక్తిశ్రద్ధలతో పఠించిన వైనం భక్తులను ఆకట్టుకుంది. స్థానిక గోరఖ్‌నాథ్ మఠానికి యోగీ ప్రధాన గురువు దీంతో ఆయన గోరఖ్ నాధ్ ఆలయంలో హనుమాన్ చాలీసా పఠించారు.    

ఇక తన నివాసంలో ట్రిపుల్ తలాఖ్ బాధితులతో మాట్లాడి ఆమెలో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేశారు. ఆపై యోగి ఓ దళితుడి నివాసానికి వెళ్లారు. అక్కడ ఆ దళితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్లను విస్మయానికి గురిచేశారు. యోగి తన భోజనాన్ని అక్కడే ముగించడం కూడా ఎవరి ఊహకు అందలేదు.

Facebook Comments
Follow me

Sarath Chandra

I'm passionate about writing, also working as a journalist. I had an Idea to share my writings, so started this blog along with cousins
Follow me

Leave a Comment